నేటి నుంచి జూనియర్‌ లెక్చరర్ల హాజరు
close

ప్రధానాంశాలు

నేటి నుంచి జూనియర్‌ లెక్చరర్ల హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంటర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్‌ లెక్చరర్లు ఈనెల 25 నుంచి కళాశాలలకు హాజరు కావాలని ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. జులై 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నందున లెక్చరర్లు ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌ వద్ద రిపోర్టు చేయాలని సూచించారు. కాగా అతిథి అధ్యాపకులు లేకుండా తరగతులు ఎలా నిర్వహిస్తారని ఇంటర్‌ విద్య ఐకాస ఛైర్మన్‌ పి.మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1658 పోస్టుల్లో అతిథిÅ అధ్యాపకులను కొనసాగిస్తూ ఉత్తర్వులివ్వాలని డిమాండ్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని