కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మ్యూజియం
close

ప్రధానాంశాలు

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మ్యూజియం

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో చేపడుతున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలతోపాటు తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పే వివరాలను పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో అందుబాటులో ఉంచుతామని రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ మ్యూజియం నిర్మాణ నిపుణులు వసీంఖాన్‌ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనుల పురోగతి గురించి ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, నగర కమిషనర్‌ అంజనీకుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డిలతో బుధవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. రెండు నెలల్లో పనుల్ని పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను, అధికారులను ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని 14వ అంతస్తు నుంచి హైదరాబాద్‌ నలుమూలల ఉన్న సందర్శనీయ స్థలాలను చూసేలా సందర్శకులకు అనుమతిస్తామన్నారు. పారిస్‌లో ఈఫిల్‌ టవర్‌, దుబాయ్‌లో బుర్జ్‌ఖలీఫాపై నుంచి ఆయా నగరాలను వీక్షించిన మాదిరిగానే హైదరాబాద్‌ నగర సందర్శకులకు అనుభూతి కలుగుతుందన్నారు. సందర్శకులకు వివరించేందుకు మ్యూజియంలో సమాచారం అందుబాటులో ఉంచుతామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని