జాతీయస్థాయి క్విజ్‌ పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ
close

ప్రధానాంశాలు

జాతీయస్థాయి క్విజ్‌ పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

కోదాడ పట్టణం, న్యూస్‌టుడే: కోయంబత్తూరులోని అమృత్‌ విశ్వవిద్యాలయం సౌజన్యంతో, ఇండియాటుడే వార్తా ఛానల్‌ గ్రూపు ఆన్‌లైన్‌లో కళలు, వాణిజ్యం, శాస్త్ర విజ్ఞానం, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలపై  ఈ నెల 16న జాతీయ స్థాయి క్విజ్‌ పోటీలు నిర్వహించింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కోదాడలోని తేజ విద్యాలయానికి చెందిన పదో తరగతి విద్యార్థులు చేపూరి వేణుగోపాల్‌, షేక్‌.అవాయిస్‌ నదీమ్‌, తొమ్మిదో తరగతి చదువుతున్న తిప్పన అభిరామ్‌రెడ్డి, షేక్‌.అబ్దుల్‌ సమద్‌ విజేతలుగా నిలిచారు. క్విజ్‌ మాస్టర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఒక్కొక్కరికి రూ.50వేల విలువైన రోబోటిక్‌ కిట్లను బహుమతిగా ఇచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని