రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను అడ్డుకుంటాం
close

ప్రధానాంశాలు

రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను అడ్డుకుంటాం

ఏఐసీఎస్‌వో జాతీయ అధ్యక్షుడు డా.ఉదిత్‌రాజ్‌

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీల్లో ఐక్యత లేక ప్రస్తుతం రాజ్యాంగంలోని హక్కులు అణచివేతకు గురవుతున్నాయని ఆలిండియా కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్‌ (ఏఐసీఎస్‌వో) జాతీయ అధ్యక్షుడు డా.ఉదిత్‌రాజ్‌ అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో ‘సమానత్వం కోసం ఐక్యత’ నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన ఏఐసీఎస్‌వో తెలంగాణ రాష్ట్ర కమిటీ, గ్రేటర్‌ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. డా.ఉదిత్‌రాజ్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ల సాధన పోరుకు సిద్ధం కావాలన్నారు. ఎంపీ డా.తిరుమావళవన్‌ మాట్లాడుతూ రాజ్యాధికార సాధనకు బహుజనులంతా ఏకం కావాలన్నారు. గద్దర్‌ మాట్లాడుతూ, దళిత బహుజనులంతా సమష్టిగా పోరాడితే రాజ్యాంగ ఉల్లంఘనలు జరగవన్నారు. రాజ్యాంగాన్ని మార్చే యత్నాలను అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ పిలుపునిచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని