గోదాముల్లో ఖాళీపై ఆరా..!
close

ప్రధానాంశాలు

గోదాముల్లో ఖాళీపై ఆరా..!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గోదాములు, వాటిలోని ఆహార ధాన్యాల నిల్వల తీరుతెన్నులు తెలుసుకోవడంపై భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా వారు పౌరసరఫరాల భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘గోదాముల్లో స్థలాలు చూపండి’ శీర్షికన ఆదివారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై ఎఫ్‌సీఐ ఛైర్మన్‌ అతీష్‌ చంద్ర స్పందించారు. స్థానిక ఎఫ్‌సీఐ అధికారులతో మాట్లాడి తాజా పరిస్థితులపై తక్షణం నివేదిక పంపాల్సిందిగా ఆదేశించారు. దీంతో వారు ఆ వివరాల సేకరణ పనిలో పడ్డారు. గోదాములు ఖాళీలు లేవంటూ ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకపోవటంతో రాష్ట్రంలో ఎక్కడి బియ్యం అక్కడే నిలిచిపోయాయి. కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలతో అధికారులు నూతన గోదాములను లీజుకు తీసుకోవటంలో జాప్యం జరుగుతోంది. ఈ విషయంపై ఎఫ్‌సీఐ ఛైర్మన్‌కు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఐ తాజా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని