14 రైళ్లు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు

ప్రధానాంశాలు

14 రైళ్లు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు

భారీ వర్షాలతో రైల్వేశాఖ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల మధ్య తిరిగే రైళ్లలో కొన్ని రద్దుకాగా, పలు రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు ద.మ.రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్‌ రైల్వేజోన్‌ పరిధిలోని ఇగత్‌పురి-లోనావాలా, కొల్హాపూర్‌-మిరాజ్‌ సెక్షన్ల మధ్య కొండచరియలు విరిగిపడటంతో 14 రైళ్లను రద్దుచేశారు. 24-28తేదీల మధ్య.. నాలుగు రైళ్లు ఒక్కో రోజు, పది రైళ్లు నాలుగు రోజుల చొప్పున రద్దయ్యాయి. ఇతర రూట్లలో నడిచే ముంబయి-తిరువనంతపురం, 21, 22, 23 తేదీల్లో బయల్దేరిన వెరవల్‌-తిరువనంతపురం, చండీగఢ్‌-కొచ్చువేళి, హిస్సార్‌-కొయంబత్తూరుల మధ్య నడిచే రైళ్లను వర్షాల నేపథ్యంలో దారి మళ్లించి నడిపినట్లు రైల్వేశాఖ పేర్కొంది. 23న బయల్దేరాల్సిన తిరుపతి-కొల్హాపూర్‌, 26న బయల్దేరాల్సిన హౌరా-వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌లను రైల్వేశాఖ రద్దుచేసింది. 22, 23 తేదీల్లో బయల్దేరిన ఎర్నాకుళం-హజ్రత్‌ నిజాముద్దీన్‌, పోరుబందర్‌-కొచ్చువేళి, కేఎస్‌ఆర్‌ బెంగళూరు-అజ్మీర్‌ రైళ్లను దారి మళ్లించి నడిపించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని