ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బండా శ్రీనివాస్‌

ప్రధానాంశాలు

ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బండా శ్రీనివాస్‌

నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎస్సీ కులాల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ మాదిగను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ విద్యార్ధి నాయకుని దశ నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. తొలుత కాంగ్రెస్‌ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్‌ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. హాకీ క్రీడాకారుడైన శ్రీనివాస్‌ హుజూరాబాద్‌ హాకీ క్లబ్‌ అధ్యక్షుడిగా, ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. హుజూరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరక్టర్‌ గా, జిల్లా టెలికాం బోర్డు సభ్యునిగానూ పనిచేశారు. హుజూరాబాద్‌ పట్టణం నుంచి ఎంపీటీసీగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావం నుంచి అందులో పనిచేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెరాస పార్టీ హుజూరాబాద్‌ మండలాధ్యక్షునిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, కార్యదర్శిగా పని చేశారు. ఈటల రాజేందర్‌ రాజీనామా అనంతరం హుజూరాబాద్‌లో పార్టీ పరంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తనకు సీఎం కేసీఆర్‌ అవకాశం ఇవ్వడంపై బండా శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని