ఆర్‌ఎంపీల అసోసియేషన్‌ వినతి పత్రంపై నిర్ణయం తీసుకోండి

ప్రధానాంశాలు

ఆర్‌ఎంపీల అసోసియేషన్‌ వినతి పత్రంపై నిర్ణయం తీసుకోండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్‌ఎంపీ వైద్యులకు కమ్యూనిటీ పారామెడికల్‌ శిక్షణ నిర్వహించాలంటూ అసోసియేషన్‌ ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2015లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 428 ప్రకారం కమ్యూనిటీ పారామెడికల్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ జూన్‌ 5న ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. దీన్ని పరిష్కరించకపోవడంపై తెలంగాణ ఆర్‌ఎంపీఎస్‌, పీఎంపీఎస్‌ సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షుడు పి.వెంకన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి కేసు పూర్వాపరాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా పిటిషనర్ల అసోసియేషన్‌ ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి చట్టప్రకారం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని