కొవాగ్జిన్‌ టీకాపై బ్రెజిల్‌లో క్లినికల్‌ పరీక్షల నిలిపివేత

ప్రధానాంశాలు

కొవాగ్జిన్‌ టీకాపై బ్రెజిల్‌లో క్లినికల్‌ పరీక్షల నిలిపివేత

హైదరాబాద్‌: కొవాగ్జిన్‌ టీకాపై భారత్‌ బయోటెక్‌ బ్రెజిల్‌లో చేపట్టిన క్లినికల్‌ పరీక్షలను బ్రెజిల్‌ ఔషధ నియంత్రణ సంస్థ ‘అన్విసా’ నిలిపివేసింది. బ్రెజిల్‌కు టీకా సరఫరా వ్యవహారం వివాదాస్పదం కావడంతో.. ఆ దేశానికి చెందిన ప్రిసిసా మెడికమెంటోస్‌ అనే సంస్థతో కుదుర్చుకున్న టీకా సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై ‘అన్విసా’ స్పందిస్తూ.. కొవాగ్జిన్‌ టీకాపై బ్రెజిల్‌లో భారత్‌ బయోటెక్‌ చేపట్టిన క్లినికల్‌ పరీక్షలను ముందస్తు చర్యగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని