ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌

ప్రధానాంశాలు

ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌

21న ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష

టీఎస్‌ఆర్‌జేసీ, ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను అధికారులు శనివారం ఖరారు చేశారు. రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ తొలి ఏడాదిలో ప్రవేశాలకు ఆగస్టు 14న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్‌.రమణకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 194 ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరేందుకు ఆగస్టు 21న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరపనున్నట్లు ఆదర్శ పాఠశాలల అదనపు సంచాలకురాలు ఉషారాణి తెలిపారు. ఏడు నుంచి పదో తరగతుల్లో ఖాళీ సీట్లకు అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని