3,600 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం

ప్రధానాంశాలు

3,600 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం

ఈనాడు, హైదరాబాద్‌: గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 3,600 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ ప్రాథమిక అంచనా వేసింది. 3,300 ఎకరాల్లో పసుపు, 300 ఎకరాల్లో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల పసుపు తోటలో వర్షపు నీటికి మొక్కలు కొట్టుకుపోయాయి. పసుపు సాగుకు రూ.వేల పెట్టుబడులు పెట్టిన రైతులు ఎక్కువగా నష్టపోయారు. దాదాపు రూ.2.50 కోట్ల విలువైన పంటలను రైతులు కోల్పోయినట్లు అంచనా. వర్షపు నీరు పూర్తిగా తగ్గిన తరవాత నష్టం వాస్తవ అంచనాలు తెలుస్తాయని ఉద్యాన అధికారులు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని