కోర్టు ధిక్కరణ అప్పీళ్లలో హాజరుకావాల్సిందే

ప్రధానాంశాలు

కోర్టు ధిక్కరణ అప్పీళ్లలో హాజరుకావాల్సిందే

ఈనాడు, హైదరాబాద్‌: కోర్టు ధిక్కరణ కేసుల్లో శిక్ష పడ్డ అధికారులు, తదితరులు అప్పీళ్లు దాఖలు చేసినపుడు కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని  హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి శిక్షను ఎదుర్కొంటూ హాజరుకాకపోవడం సరికాదని, ఇకపై దీన్ని అనుమతించబోమని తేల్చి చెప్పింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో శిక్షగా విధించిన జరిమానాలను రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌ చేస్తే శిక్ష అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు ఉంటుందని స్పష్టంచేసింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో సింగిల్‌ జడ్జి విధించిన శిక్షలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్‌ రూరల్‌ ఆర్డీవో సీహెచ్‌.మహేందర్‌జి,  హైదరాబాద్‌లోని ఎస్‌.ఆర్‌.నగర్‌ ఎస్‌.ఐ. అశోక్‌నాయక్‌,  తెలంగాణ రెసిడెన్షియల్‌ సొసైటీ కార్యదర్శి ఎ.సత్యనారాయణరెడ్డి కోర్టు ధిక్కరణ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణలో భాగంగా అప్పీలుదారులు ఖచ్చితంగా హాజరవ్వాలని, సింగిల్‌ జడ్జి విధించిన జరిమానాను రిజిస్ట్రీ వద్ద చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని