టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఒప్పంద ఉద్యోగాలకు ప్రకటన

ప్రధానాంశాలు

టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఒప్పంద ఉద్యోగాలకు ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: పోలీస్‌శాఖ పరిధిలోని తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌)లో ఒప్పంద (కాంట్రాక్టు) పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 నుంచి ఆగస్టు 8 వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సంచాలకులు సూచించారు. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ విభాగంలో 7 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఇందులో 3 కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌, 2 బయాలజీ/సిరాలజీ, 2 డీఎన్‌ఏ పోస్టులు ఉన్నాయి. ల్యాబ్‌ టెక్నీషియన్‌ విభాగంలో 1 కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌ పోస్టును భర్తీ చేయనున్నారు. ఎంఎస్సీలో కనీసం 70శాతం మార్కులు సాధించిన, 21-34 ఏళ్ల వయసు(జులై 1 నాటికి) అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మార్కుల్లో 5 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ దరఖాస్తుదారులకు వయోపరిమితిలో అయిదేళ్ల మినహాయింపు ఇచ్చారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక నిర్వహిస్తారు. టీఎస్‌ పోలీస్‌ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని.. పూర్తిచేసిన వాటిని ‘డైరెక్టర్‌ టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌, రెడ్‌హిల్స్‌, హైదరాబాద్‌’కు స్పీడ్‌పోస్టు/కొరియర్‌ ద్వారా పంపొచ్చు. లేక నేరుగా టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ కార్యాలయంలో అందజేయవచ్చు. పూర్తి వివరాలకు 040-23326252, 23307138 నంబర్లలో సంప్రదించవచ్చని డైరెక్టర్‌ సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని