ఎంపీ బండా ప్రకాశ్‌పై కేసు నమోదు

ప్రధానాంశాలు

ఎంపీ బండా ప్రకాశ్‌పై కేసు నమోదు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌తోపాటు, మరో ఇద్దరిపై వరంగల్‌ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సుబేదారి ఠాణాలో ఈ నెల 23న కేసు నమోదైంది. అల్లూరి ట్రస్టు కార్యదర్శి, ట్రస్టీగా పనిచేస్తున్న బండా ప్రకాశ్‌తోపాటు ఎ.సత్యనారాయణ, ఎ.వంశీధర్‌లు 2016 నుంచి 2018 వరకు సుమారు రూ.12.21 లక్షల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ తెలిపారు. దీనిపై బండా ప్రకాశ్‌ను వివరణ కోరగా.. ట్రస్టుతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటిసంబంధం లేదన్నారు. ఆయన ట్రస్టు సభ్యుడు కాదని, ఆయన తండ్రి గతంలో సభ్యుడిగా పనిచేశారన్నారు. తమ ట్రస్టులో లెక్కలన్నీ పారదర్శకంగా ఉన్నాయన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని