కృష్ణా ట్రైబ్యునల్‌కు ఇద్దరు అసెసర్‌ల నియామకం

ప్రధానాంశాలు

కృష్ణా ట్రైబ్యునల్‌కు ఇద్దరు అసెసర్‌ల నియామకం

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌కు ఇద్దరు అసెసర్‌లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు కృష్ణా నదీ యాజమాన్య మండలి ఛైర్మన్‌గా పనిచేసిన ఎస్‌కే శ్రీవాస్తవ, కేంద్ర జల సంఘంలో చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేసి పదవీవిరమణ పొందిన రవిశంకర్‌లను అసెసర్‌లుగా నియమించింది. వీరిద్దరూ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. నీటి మదింపు విషయంలో ట్రైబ్యునల్‌కు సహాయం చేయడానికి వీరిని నియమించారు. సాగునీటి ప్రాజెక్టులు, నీటి యాజమాన్యం, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉన్నవారు మాత్రమే ఇందుకు అర్హులు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని