సీబీఐటీలో అటల్‌ కమ్యూనిటీ ఇన్నోవేషన్‌ కేంద్రం

ప్రధానాంశాలు

సీబీఐటీలో అటల్‌ కమ్యూనిటీ ఇన్నోవేషన్‌ కేంద్రం

తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక కళాశాల

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని సీబీఐటీ కళాశాల అరుదైన అవకాశం దక్కించుకుంది. కళాశాలలో అటల్‌ కమ్యూనిటీ ఇన్నోవేషన్‌ కేంద్రం (ఏసీఐసీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఏసీఐసీ ఏర్పాటుకు తెలంగాణలో ఎంపికైన ఏకైక కళాశాల సీబీఐటీనే కావడం విశేషం. దేశవ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలు, అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌లో భాగంగా కళాశాల స్థాయిలో అటల్‌ కమ్యూనిటీ ఇన్నోవేషన్‌ కేంద్రాలను నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేస్తోంది. రానున్న ఐదేళ్లలో ఎంటర్‌ప్రెన్యూర్‌ వ్యవస్థను పెంపొందించేందుకు ఈ కేంద్రాలు కృషిచేస్తాయి. ఇప్పటికే సీబీఐటీ తరఫున ఏసీఐసీ-సీబీఐటీ పరిశోధన, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఫౌండేషన్‌ను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌గా నమోదు చేశారు. తాజాగా సీబీఐటీలో ఏసీఐసీని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి సంచాలకుడిగా కళాశాల బయోటెక్నాలజీ విభాగం అధిపతి ఉమాకాంత్‌ చౌదరి వ్యవహరించనున్నారు. ఈ కేంద్రం ఆధ్వర్యంలో వచ్చే ఐదేళ్లలో ఆవిష్కరణలు, అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు సీబీఐటీ, నీతి ఆయోగ్‌ సంయుక్తంగా రూ.4.51 కోట్లు వెచ్చించనున్నాయి. రానున్న ఐదేళ్లలో వందకుపైగా అంకుర సంస్థలను ఏర్పాటు చేసి ఇంక్యుబేట్‌ చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు సీబీఐటీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.రవీందర్‌రెడ్డి  వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని