దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ

ప్రధానాంశాలు

దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ

పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌
భూపాలపల్లిలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ

భూపాలపల్లి టౌన్‌, న్యూస్‌టుడే: దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ మారిందని రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. సోమవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4.15 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 3.09 లక్షల మంది అర్హులకు అందజేస్తున్నట్లు వెల్లడించారు. 2009లో రేషన్‌కార్డు కావాలంటూ పైరవీలతో వచ్చేవారని, ఇప్పుడు నేరుగా లబ్ధిదారుడికి అందిస్తున్నామన్నారు.  కార్యక్రమంలో గిరిజనాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని