మద్దతు ప్రచారం వాస్తవంకాదు

ప్రధానాంశాలు

మద్దతు ప్రచారం వాస్తవంకాదు

మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో ఎన్నికల నేపథ్యంలో తాను ఎవరికో మద్దతు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. తాను మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సోమవారం ట్విటర్‌లో కోరారు. విద్య, వైద్యం, ఉపాధికే తన మద్దతు ఉంటుందని తెలిపారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తాను ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నానని పేర్కొంటూ వివాదాల్లోకి తనని లాగవద్దని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని