జిల్లాకు రూ.కోటి విడుదల

ప్రధానాంశాలు

జిల్లాకు రూ.కోటి విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.కోటి చొప్పున విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాలకు రూ.32 కోట్లను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రత్యేక ఖాతాలను నిర్వహించి ఈ నిధులను ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని