‘పీఎంజీఎస్‌వై’కి రూ.122.81 కోట్లు

ప్రధానాంశాలు

‘పీఎంజీఎస్‌వై’కి రూ.122.81 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం కింద రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.122.81 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద ఈఏడాదికి రూ.180 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించగా.. రూ.122.81 కోట్లు విడుదల చేసింది.

‘ఆరోగ్యలక్ష్మి’కి నిధుల విడుదల

రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం కోసం ప్రారంభించిన ఆరోగ్యలక్ష్మి పథకానికి ప్రభుత్వం రూ.70.51 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మహిళాశిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి డి.దివ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.278.30 కోట్లు కేటాయించగా.. గతంలో రూ.68.63 కోట్లు మంజూరు చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని