2న నాగార్జునసాగర్‌లో సీఎం పర్యటన

ప్రధానాంశాలు

2న నాగార్జునసాగర్‌లో సీఎం పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగస్టు 2న నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హాలియాలో నియోజకవర్గ ప్రగతి సమీక్షలో సీఎం పాల్గొననున్నారు. సాగర్‌ ఉపఎన్నికల సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత తాను నియోజకవర్గానికి వస్తానని ప్రకటించారు. దీనికి అనుగుణంగా తాజాగా సాగర్‌లో పర్యటించాలని ఆయన నిర్ణయించారు. ఆ రోజు సభలో ఇచ్చిన హామీల అమలుతో పాటు నియోజకవర్గ అభివృద్ధి, నాగార్జునసాగర్‌, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ పరిధిలోని ఎత్తిపోతల పథకాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని