ఉమ్మడి పీజీ ప్రవేశపరీక్ష నోటిఫికేషన్‌ విడుదల

ప్రధానాంశాలు

ఉమ్మడి పీజీ ప్రవేశపరీక్ష నోటిఫికేషన్‌ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలోని పీజీ కోర్సులలో ప్రవేశానికి ఉమ్మడి పోస్టుగ్రాడ్యుయేట్‌ ప్రవేశ పరీక్ష (సీపీగేట్‌)-2021 నోటిఫికేషన్‌ జారీ అయింది. పరీక్ష కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి బుధవారం వివరాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని ఉస్మానియా, జేఎన్‌టీయూ, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష జరగనుంది. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీజే, లైబ్రరీ సైన్స్‌, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సులతోపాటు పీజీ డిప్లొమా, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 25 మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 8 నుంచి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దరఖాస్తు రుసుము ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.800 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ విద్యార్థులకు రూ.600గా నిర్ణయించారు. అదనపు సబ్జెక్టుల కోసం ఒక్కొక్కదానికి రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.osmania.ac.in  లేదా www.cpget.tsche.ac.in లేదా www.tscpget.com లేదా www.ouadmissions.com లో సంప్రదించవచ్చు.

 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని