ఆర్‌ఆర్‌ఆర్‌పై ఆగస్టు నుంచి క్షేత్రస్థాయి అధ్యయనం

ప్రధానాంశాలు

ఆర్‌ఆర్‌ఆర్‌పై ఆగస్టు నుంచి క్షేత్రస్థాయి అధ్యయనం

టెండర్‌ దక్కించుకున్న కే అండ్‌ జే ప్రాజెక్ట్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రాంతీయ రింగ్‌ రోడ్డు తుది మార్గం (అలైన్‌మెంట్‌) ఖరారుకు గుత్తేదారు సంస్థ ఆగస్టు తొలి వారం నుంచి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆవల సుమారు 344 కిలోమీటర్ల మేర ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. 158 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాత్కాలిక జాతీయ రహదారి నంబర్‌ కేటాయించింది. భారత్‌మాల పరియోజన పథకం కింద సంగారెడ్డి- నర్సాపూర్‌- తూప్రాన్‌- గజ్వేల్‌- యాదగిరిగుట్ట- చౌటుప్పల్‌ వరకు ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే సవివర నివేదిక (డీటేల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు-డీపీఆర్‌) రూపొందించింది. ఆ మార్గంలోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాల్సి ఉంది. దీనిపై పూర్తిస్థాయి నివేదిక తయారీకి గుత్తేదారులను కేంద్రం ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఉన్న 20 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. మహారాష్ట్రకు చెందిన కే అండ్‌ జే ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ టెండర్‌ను దక్కించుకుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని