ఇంటింటా ఆవిష్కరణల దరఖాస్తుల గడువు పెంపు

ప్రధానాంశాలు

ఇంటింటా ఆవిష్కరణల దరఖాస్తుల గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటా ఆవిష్కరణల ప్రదర్శన కార్యక్రమానికి దరఖాస్తుల గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. ఆవిష్కరణల్లో ఉత్తమమైన వాటిని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శిస్తారు. 33 జిల్లాల నుంచి ఒకేసారి ఆన్‌లైన్‌ ప్రదర్శనలను నిర్వహిస్తారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల్లో ఆవిష్కరణలను అనుమతిస్తారు.  తమ ఆవిష్కరణకు సంబంధించిన 6వాక్యాలు, 2నిమిషాల వీడియో, 4ఫొటోలు జతచేయాల్సి ఉంటుందని, ఆవిష్కర్త పేరు, ఫోన్‌ నంబర్‌, వయసు, వృత్తి, గ్రామం, జిల్లా పేర్లు 9100678543కి వాట్సప్‌ చేయాలని టీఎస్‌ఐసీ కోరింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని