దశల వారీగా రెవెన్యూ సమస్యల పరిష్కారం: సీఎస్‌

ప్రధానాంశాలు

దశల వారీగా రెవెన్యూ సమస్యల పరిష్కారం: సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: రెవెన్యూశాఖ పరిధిలోని పలు సమస్యలకు దశలవారీగా పరిష్కారం చూపనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ట్రెసా నాయకులకు తెలిపారు. గురువారం సచివాలయంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్‌ నేతృత్వంలోని ప్రతినిధులు సీఎస్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అనంతరం వారు విలేకరులకు వివరాలు తెలిపారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల నుంచి రెవెన్యూ సహాయకుల వరకూ అన్ని సమస్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు. అన్నింటినీ పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నామని, ముఖ్యమైన వాటిని సీఎం దృష్టికి తీసుకెళతామని సీఎస్‌ హామీ ఇచ్చారని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని