సెప్టెంబరు 12న ‘మా’ ఎన్నికలు

ప్రధానాంశాలు

సెప్టెంబరు 12న ‘మా’ ఎన్నికలు

ఈనాడు, హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) కార్యవర్గ ఎన్నికలు సెప్టెంబరు 12న జరపాలని నిర్ణయించారు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వర్చువల్‌ సమావేశం జరిగింది. ప్రస్తుత కార్యవర్గంలోని సభ్యుల మధ్య పలు విషయాలపై వాదోపవాదాలు జరిగినట్టు సమాచారం. గత కార్యవర్గం, ఎన్నికల నిర్వహణపై విస్తృతంగా చర్చ జరిగిందని తెలిసింది. ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మూడు గంటలపాటు చర్చించిన అనంతరం ఆగస్టు 22న సర్వసభ్య సమావేశం ఖరారు చేశారు. సెప్టెంబరు 12ని ఎన్నికల తేదీగా నిర్ణయించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆ లోపు మరోసారి కార్యవర్గం సమావేశమై ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. క్రమశిక్షణ కమిటీ సభ్యులైన మోహన్‌బాబు, మురళీమోహన్‌, గిరిబాబు, శివకృష్ణ, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్‌తోపాటు, కార్యవర్గంలో భాగమైన బెనర్జీ, జీవిత రాజశేఖర్‌, హేమ, శివబాలాజీ, రాజీవ్‌ కనకాల, రాజారవీంద్ర, ఉత్తేజ్‌, సురేష్‌ కొండేటి, ఏడిద శ్రీరామ్‌, తనీష్‌, సమీర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని