లేడనుకున్న అన్న 40 ఏళ్ల తర్వాత కళ్ల ముందుకు..

ప్రధానాంశాలు

లేడనుకున్న అన్న 40 ఏళ్ల తర్వాత కళ్ల ముందుకు..

 

ఆడిపాడే వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తి సుమారు 40 ఏళ్ల తర్వాత అనుకోకుండా కుటుంబసభ్యుల చెంతకు చేరాడు. నల్గొండ చాకలిబజార్‌కు చెందిన నల్లగంతుల రాములు కుమారుడు పుల్లయ్య ఆరో తరగతి చదివే సమయంలో తండ్రి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో భిక్షాటనతో జీవించాడు. 4నెలల క్రితం ఆయన ఖమ్మం చేరుకోగా స్థానిక అన్నం సేవా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ అన్నం శ్రీనివాస్‌ ఆశ్రయమిచ్చారు. వివరాలు సేకరించి పుల్లయ్యను అతడి కుటుంబీకులకు అప్పగించారు. ఇప్పటికే పుల్లయ్య తల్లిదండ్రులు మృతి చెందారు. లేడనుకున్న అన్న ఇన్నేళ్లకు రావడంతో తోబుట్టువులు రేణుక, దుర్గ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

- నల్గొండ, న్యూస్‌టుడే


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని