బీటెక్‌, బీఫార్మసీ విద్యార్థులకు సొంత జిల్లాల్లోనే పరీక్ష కేంద్రాలు

ప్రధానాంశాలు

బీటెక్‌, బీఫార్మసీ విద్యార్థులకు సొంత జిల్లాల్లోనే పరీక్ష కేంద్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌, బీఫార్మసీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు సొంత జిల్లాల్లోనే పరీక్షలు రాసుకునేందుకు జేఎన్‌టీయూ అవకాశం కల్పించింది. రెండు, మూడు సంవత్సరాల రెండో సెమిస్టర్‌(2-2, 3-2)తోపాటు 2-1, 3-1, 4-1 సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు తాము నివసించే జిల్లాల్లోని కళాశాలలనే కేంద్రాలుగా ఎంచుకునే వీలుంది. విద్యార్థులు తాము చదివే కళాశాలలను సంప్రదించి కేంద్రాల ఐచ్ఛికాలు ఇవ్వొచ్చు. ఈ నెల 3వ తేదీలోగా విద్యార్థులు కేంద్రాలను ఎంచుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.

పీజీ కోర్సుల షెడ్యూల్‌ మార్పు

ఎంటెక్‌, ఎం.ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల మొదటి ఏడాది రెండో సెమిస్టర్‌ అకడమిక్‌ షెడ్యూల్‌ను మారుస్తూ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం సెమిస్టర్‌ పరీక్షలు అక్టోబరు 14వ తేదీ నుంచి 27 మధ్య జరగనున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని