రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతికోత్సవాలు

ప్రధానాంశాలు

రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతికోత్సవాలు

సారస్వత పరిషత్తు నిర్ణయం

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాంస్కృతికోత్సవాలు నిర్వహించి అక్కడి సాహిత్య, చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలపై సదస్సులు, కవి పండితుల సత్కారం వంటి కార్యక్రమాలు జరపాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. శనివారం పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన ట్రస్టు, కార్యవర్గంతో పాటు వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ ఏడాది తెలంగాణలోని ఒక్కో జిల్లా గురించి సమగ్ర అవగాహన కోసం ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలని తీర్మానించారు. సభ్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి సూచనపై బంజారా, గోండు వంటి గిరిజనుల భాషా, సంస్కృతులు, తెలుగు సంస్కృతిపై తులనాత్మక సదస్సులు నిర్వహించాలని కార్యవర్గం నిర్ణయించింది.  ఉపాధ్యక్షులు ముదిగంటి సుజాతారెడ్డి, కోశాధికారి మంత్రి రామారావు, పరీక్ష కార్యదర్శి మసన చెన్నప్ప, ట్రస్టు సభ్యులు  పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని