రెండు రోజుల్లో గుంతలు పూడుస్తాం

ప్రధానాంశాలు

రెండు రోజుల్లో గుంతలు పూడుస్తాం

‘ఈనాడు’ కథనానికి ర.భ. శాఖ స్పందన

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న గుంతలను రెండు రోజుల్లో పూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ జాతీయ రహదారుల విభాగం ఇంజినీర్‌-ఇన్‌-ఛీఫ్‌ ఐ.గణపతిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘రహదారులు వర్షార్పణం’ శీర్షికన బుధవారం కథనం వెలువడిన విషయం తెలిసిందే. నకిరేకల్‌ నుంచి నల్గొండ రహదారి పనుల కోసం గడిచిన శనివారం గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్నాం... పిచ్చి చెట్లను తొలగించే పనులు చేపట్టారు. గుంతలను రెండు రోజుల్లో పూడ్చి వేసే పనులు పూర్తి చేస్తామని గణపతిరెడ్డి చెప్పారు. ‘వరంగల్‌-ఖమ్మం రహదారిని జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కి గడిచిన ఏడాది మే నెలలో బదలాయించినా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకోలేదు. ఇల్లందు నుంచి వర్దన్నపేట వరకు మరమ్మతుల కోసం మూడో దఫా టెండర్లు ఆహ్వానించాం. హైదరాబాద్‌-భూపాలపట్నం జాతీయ రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలకు విస్తరించేందుకు నిధులు మంజూరు కావడంతో టెండర్లు ఆహ్వానించాం. సూర్యాపేట పాత జాతీయ రహదారి మరమ్మతుల పనులు గుత్తేదారుకు అప్పగించినా పనులు చేయకపోవటంతో అగ్రిమెంటును రద్దు చేశాం. త్వరలో టెండర్లు పిలుస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని