ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనుల పునఃప్రారంభం

ప్రధానాంశాలు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనుల పునఃప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమ గట్టు నుండి ప్రారంభించిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పనులను పున:ప్రారంభించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఉదయసముద్రం లిఫ్టు ఇరిగేషన్‌ స్కీం (బ్రాహ్మణవెల్లెంల)ను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని నీటిపారుదలశాఖకు ఆదేశాలు జారీచేసింది. సొరంగమార్గం తవ్వకానికి, నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని విద్యుత్‌ శాఖకు సూచించింది. ఇతర ఆటంకాలను తొలగించే దిశగా చర్యలకు అనుమతించింది. ఈ పనుల పునఃప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై నీటిపారుదలశాఖ సమర్పించిన ప్రతిపాదనలకు, ఉదయసముద్రం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని