యోగ సాధనతో రక్తపోటు నివారణ

ప్రధానాంశాలు

యోగ సాధనతో రక్తపోటు నివారణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రణాళికాబద్ధమైన, ఆరోగ్యకరమైన జీవనశైలితోనే రక్తపోటును నివారించవచ్చని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఆదివారం రక్తపోటు నివారణ అంశంపై హైపర్‌టెన్షన్‌ ఇండియన్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన దృశ్యమాధ్యమ సదస్సులో ఆమె రాజ్‌భవన్‌ నుంచి పాల్గొని మాట్లాడారు. రక్తపోటును విస్మరించడం వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. రక్తపోటు బారిన పడకుండా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడంతోపాటు ఉప్పు వాడకాన్ని తగ్గించాలని సూచించారు. బోనాలు తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ఒక ప్రకటనలో బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సవాళ్లను అధిగమించడంతోపాటు ప్రజల ఆరోగ్యం కోసం తాను ప్రార్థిస్తున్నానని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని