సింహవాహినికి ప్రణమిల్లిన ప్రముఖులు

ప్రధానాంశాలు

సింహవాహినికి ప్రణమిల్లిన ప్రముఖులు

హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజా శ్రీసింహవాహినీ మహంకాళికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, విజయశాంతి తదితరులు సింహవాహినిని దర్శించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం పెద్దమంగళారం పరిధి వ్యవసాయ క్షేత్రంలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన స్నేహితురాలు రజని కుటుంబంతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని బోనమెత్తారు.
 

-న్యూస్‌టుడే, చాంద్రాయణగుట్ట, మొయినాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని