చిరు ప్రాణాన్ని చిదిమేసిన అజ్ఞానం

ప్రధానాంశాలు

చిరు ప్రాణాన్ని చిదిమేసిన అజ్ఞానం

కరకగూడెం, న్యూస్‌టుడే: మూఢనమ్మకం ఓ చిరు ప్రాణాన్ని చిదిమేసింది. అశాస్త్రీయ వైద్యం కారణంగా ఆ చిన్నారికి రెండు నెలలకే నూరేళ్లు నిండాయి. భదాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని వలస ఆదివాసీ ఆవాసం అశ్వాపురంపాడుకు చెందిన పొడియం దేవయ్య-సంగీత దంపతులకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. సోమవారం రాత్రి చిన్నారి ఏడుస్తుండటంతో కడుపు నొప్పితో బాధపడుతున్నాడని భావించి ఓ నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతడు చికిత్సలో భాగంగా శిశువును నాభి చుట్టూ కొరికాడు. ఏడుపు ఆపకపోవడంతో పసరు మందు వేశాడు. మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లిన ఆశా కార్యకర్త చిన్నారిని గుర్తించి వెంటనే కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. తర్వాత భద్రాచలం ఆసుపత్రికి తరలించగా, పసికందు సాయంత్రం మృతి చెందాడు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని