కన్నయ్యనాయుడికి ఆక్వా ఎక్స్‌లెన్స్‌ అవార్డు

ప్రధానాంశాలు

కన్నయ్యనాయుడికి ఆక్వా ఎక్స్‌లెన్స్‌ అవార్డు

ఈనాడు, హైదరాబాద్‌: హైడ్రో మెకానికల్‌ ఇంజినీరింగ్‌- డ్యాం రంగంలో జాతీయస్థాయిలో యాభై ఏళ్లుగా అందిస్తున్న సేవలకుగాను ఇంజినీర్‌ ఎన్‌.కన్నయ్యనాయుడికి ఆక్వా ఫౌండేషన్‌ సంస్థ ‘ఆక్వా ఎక్స్‌లెన్స్‌ అవార్డు-2021’ ప్రకటించింది. జల వనరుల విభాగంలో జాతీయ స్థాయిలో అందిస్తున్న సేవలకు గాను ప్రొఫెషనల్‌ ఎక్స్‌లెన్స్‌ కింద ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, యువతను తీర్చిదిద్దేందుకు తన అనుభవాన్ని ఉపయోగిస్తానంటూ ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఆక్వా సంస్థ ఛైర్మన్‌ సంజయ్‌రానా, కార్యదర్శి ప్రగ్యాశర్మకు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని