హమ్మయ్య.. ఆర్టీసీలో జీతాలొచ్చాయ్‌!

ప్రధానాంశాలు

హమ్మయ్య.. ఆర్టీసీలో జీతాలొచ్చాయ్‌!

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఎట్టకేలకు మంగళవారం జీతాలు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. దశల వారీగా మంగళవారం రాత్రి నాటికి అన్ని జోన్లు, బస్‌భవన్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు అయినట్లు సమాచారం.వినియోగించుకున్న ఉద్యోగుల సొమ్ములో సుమారు రూ.90 కోట్లను ఉద్యోగుల సహకార సంఘాని(సీసీఎస్‌)కి ఆర్టీసీ యాజమాన్యం తాజాగా చెల్లించినట్లు సమాచారం. ఆ మొత్తం నుంచి పరపతి సంఘం తీసుకున్న రూ.70 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించటంతోపాటు రుణాల కోసం 2019లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లు పరపతి సంఘం సభ్యులకు వర్తమానాన్ని పంపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని