అటవీ ఉద్యానవనాల్లో సైక్లింగ్‌, బర్డ్‌ వాచింగ్‌

ప్రధానాంశాలు

అటవీ ఉద్యానవనాల్లో సైక్లింగ్‌, బర్డ్‌ వాచింగ్‌

జాతీయ పార్కులు, అటవీ ఉద్యానవనాల్ని సందర్శించేవారికి పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు కొత్త తరహా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు అటవీశాఖ సూచించింది. మృగవని జాతీయ ఉద్యానవనం (చిలుకూరు), షామీర్‌పేట జింకల పార్కును అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి మంగళవారం సందర్శించారు. ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌, బర్డ్‌ వాచింగ్‌ వంటి కార్యక్రమాల్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిర్వహించాలని సూచించారు. అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ జి.చంద్రశేఖర్‌రెడ్డి, చీఫ్‌ కన్జర్వేటర్లు తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని