డెంగీతో చిన్నారి మృతి

ప్రధానాంశాలు

డెంగీతో చిన్నారి మృతి

అనారోగ్యంతో కడచూపునకూ నోచుకోని తల్లి

సిర్పూర్‌(యు), న్యూస్‌టుడే: డెంగీ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడేళ్ల చిన్నారి కన్నుమూసింది. ఆమె తల్లి అదే ఆసుపత్రిలో 20 రోజులుగా కిడ్నీ వ్యాధితో మంచానికే పరిమితమై.. కన్నకూతురి కడచూపునకూ దూరమైంది. ఈ హృదయ విదారక సంఘటన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నారి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. కుమురం భీం జిల్లా సిర్పూర్‌(యు) మండలంలోని శెట్టిహడ్తినూర్‌ గ్రామానికి చెందిన రవీందర్‌, శారద దంపతులు ఉపాధి నిమిత్తం నిర్మల్‌ జిల్లా బోరిగాంలో నివాసముంటున్నారు. వీరి కూతురు జోషిత(3)కు వారం కిందట జ్వరం వచ్చింది. తొలుత సాధారణ జ్వరమని భావించారు. ఎంతకూ తగ్గకపోవడంతో సోమవారం నిర్మల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షల అనంతరం డెంగీగా నిర్ధారణ కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం జోషిత మరణించింది. శారద ఆదిలాబాద్‌ రిమ్స్‌లోనే కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతోంది. కూతురి మృతదేహానికి స్వగ్రామమైన శెట్టిహడ్తినూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి లేవలేని పరిస్థితిలో ఉండటంతో రాలేకపోవడం విషాదం నింపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని