కాళేశ్వరం ప్రాజెక్టులో స్టీలు ధరల పెంపు!

ప్రధానాంశాలు

కాళేశ్వరం ప్రాజెక్టులో స్టీలు ధరల పెంపు!

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రెండు, నాలుగు దశల్లో నిర్మాణాలకు సంబంధించి స్టీలు ధరల పెంపుపై రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీ చర్చించింది. మంగళవారం సాయంత్రం కమిటీ ఛైర్మన్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ అధ్యక్షతన సమావేశమై పలు ప్రాజెక్టులపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రైమరీ, సెకండరీ రకాల స్టీలు ధరలను ఏ విధంగా అన్వయించాలి, ఎంత మేరకు పెంపును ఆమోదించాలనేదానిపై చర్చించినట్లు సమాచారం. స్టీలు ధరల పెంపుతోపాటు చెల్లింపులపై ప్రతిపాదనలు చర్చకు రాగా ప్రభుత్వ పరిశీలనకు పంపనున్నట్లు తెలిసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల్లోని మూడో ప్యాకేజీలో ఆవాసాల తొలగింపు, పరిహారం పెంపుపైనా చర్చ జరగగా కమిటీ మరింత సమాచారం కోరినట్లు తెలిసింది. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు హరిరాం, వెంకటేశ్వర్లు పలువురు సీఈలు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని