సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ అమ్మకంపై నిర్ణయం తీసుకోలేదు

ప్రధానాంశాలు

సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ అమ్మకంపై నిర్ణయం తీసుకోలేదు

ఏపీ మంత్రి పేర్ని నాని

ఈనాడు, అమరావతి: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకాలపై నిర్ణయం తీసుకోలేదని, కమిటీలు వేశామని, అధ్యయనం జరుగుతోందని ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు.  ‘గతేడాది జూన్‌లో నటులు చిరంజీవి, నాగార్జునతోపాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్‌రాజుతోపాటు పలవురు సినిమాహాళ్ల యాజమాన్యాల ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వివిధ అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. అందులో ఆన్‌లైన్‌ టికెట్ల అంశమూ ఒకటి’ అని నాని వెల్లడించారు. సినిమా రంగ ప్రతినిధులతో త్వరలోనే సమావేశం నిర్వహించి వారి సూచనలు తీసుకుంటామని మంగళవారం ఆయన విలేకరులకు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే... 2002 సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ టికెట్ల అమ్మకాలపై ప్రయత్నం జరుగుతోందని మంత్రి ప్రస్తావించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని