వడ్డీ సహా రైతు రుణాలను మాఫీ చేస్తాం

ప్రధానాంశాలు

వడ్డీ సహా రైతు రుణాలను మాఫీ చేస్తాం

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

జమ్మికుంట, జమ్మికుంట గ్రామీణం, హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా రూ.50వేల వరకు ఉన్న రైతు రుణాలన్నింటినీ వారం పది రోజుల్లోగా మాఫీ చేసి మార్చి తరవాత రూ.లక్ష వరకు ఉన్న రుణాలను వడ్డీతో సహా మాఫీ చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మహిళా, చేనేత సంఘాల సభ్యులకు రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జమ్మికుంట మండలపరిధిలోని మహిళాసంఘాల సభ్యుల ఖాతాల్లో రూ.2.34 కోట్ల వడ్డీ లేని బ్యాంక్‌ లింకేజీ, రూ.1.88 కోట్ల స్త్రీనిధి రుణాలను జమచేశామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుంటే తెరాస ప్రభుత్వం కొత్తవాటిని మంజూరు చేస్తుందన్నారు. తెరాస నాయకుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ.. కరోనా మూలంగా దెబ్బతిన్న చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని స్వరాష్ట్రంలోనే ఉద్యోగులకు తక్కువ వేతనాలు

ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే ఉద్యోగులకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఎన్జీవోల సంఘం జిల్లాశాఖ ఆధ్యర్యంలో హుజూరాబాద్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో మాట్లాడారు. దేశంలో అత్యధిక వేతనాలు తీసుకునేది తెలంగాణ ఉద్యోగులేనని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని