అంబేడ్కర్‌ భవన శంకుస్థాపన విషయంలో వాగ్వాదం

ప్రధానాంశాలు

అంబేడ్కర్‌ భవన శంకుస్థాపన విషయంలో వాగ్వాదం

ఎమ్మెల్యే రాఠోడ్‌ను అడ్డుకున్న దళితులు

తలమడుగు, న్యూస్‌టుడే: బోథ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు వాహనాన్ని దళిత సంఘాలు, గ్రామస్థులు అడ్డుకోవడం లాఠీఛార్జీకి దారితీసింది. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగులో రాయితీ రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. మూడేళ్ల క్రితం అంబేడ్కర్‌ భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరయ్యాయని, ఇప్పటికైనా భూమిపూజ చేయాలని సర్పంచి కరుణాకర్‌రెడ్డి, దళితనేతలు ఎమ్మెల్యేను కోరారు. టెండరు పిలవనందున భూమిపూజ చేయలేనని ఆయన బదులివ్వడంతో వారు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేశారు. గాయపడిన పలువురిని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. సీఐ పురుషోత్తం తీరును నిరసిస్తూ తలమడుగు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. కాంగ్రెస్‌ నేతలు మద్దతు తెలపడంతో చివరికి సీఐ క్షమాపణకోరారు. తర్వాత వారంతా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నాచేపట్టారు. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ వారితో చర్చించారు. భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని