జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యాసంస్థల హవా

ప్రధానాంశాలు

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యాసంస్థల హవా

ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ ప్రభంజనం

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత విజయాలు సాధించారని ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ వరదారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీల్లో 2, 3, 60, 156, 177, 306, 338, 399, 414, 441, 470తో పాటు మరెన్నో ర్యాంకులు పొందినట్లు వివరించారు. విద్యార్థులకు సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.​​​​​


​​​​​​​శ్రీచైతన్య సంచలన విజయం

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచినట్లు ఆ విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ ఓ ప్రకటనలో తెలిపారు. తమ విద్యార్థులు నాలుగు ఆలిండియా మొదటి ర్యాంకులు పొందినట్లు వివరించారు. అన్ని కేటగిరీల్లో టాప్‌ 10లోపు 9 ర్యాంకులు, 100లోపు 75 ర్యాంకులు శ్రీచైతన్యవేనని పేర్కొన్నారు. అనితర సాధ్యమైన ప్రోగ్రామ్‌లు, మైక్రోషెడ్యూల్స్‌, ఇంటర్నల్‌ ఎగ్జామ్స్‌, ఈ-ప్రజ్ఞ ఆన్‌లైన్‌ యాప్‌, మంచి అధ్యాపక బృందం వల్లే ఇంతటి ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక సిబ్బందిని ఆ విద్యాసంస్థల అధినేత డా.బీఎస్‌ రావు అభినందించారు.


రికార్డు సృష్టించిన నారాయణ

నారాయణ విద్యార్థులు జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో రికార్డు సృష్టించినట్లు ఆ విద్యాసంస్థల డైరెక్టర్లు డా..పి. సింధూర నారాయణ, పి.శరణి నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు ఆలిండియా మొదటి ర్యాంకు సాధించగా వారిలో నలుగురు నారాయణ విద్యార్థులేనని పేర్కొన్నారు. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో మొదటి 10లోపు 9 ర్యాంకులు, 100లోపు 26, 500లోపు 74, 1000లోపు 125 ర్యాంకులు పొందినట్లు చెప్పారు. అన్ని కేటగిరీల్లో 100లోపు 93 ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. అనితరసాధ్యమైన శిక్షణ, రీసెర్చ్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామ్‌లు, పటిష్ఠ ప్రణాళిక, స్టడీ మెటీరియల్‌, వారాంతపు పరీక్షల వల్ల ఈ ఘనత సాధ్యమైందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని