‘స్పుత్నిక్‌ లైట్‌’ టీకాపై 3వ దశ క్లినికల్‌ పరీక్షలు

ప్రధానాంశాలు

‘స్పుత్నిక్‌ లైట్‌’ టీకాపై 3వ దశ క్లినికల్‌ పరీక్షలు

డాక్టర్‌ రెడ్డీస్‌కు డీసీజీఐ అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: రష్యాకు చెందిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) ఆవిష్కరించిన ఒకే డోసు కొవిడ్‌ టీకా స్పుత్నిక్‌ లైట్‌ను మనదేశంలో విడుదల చేయడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా స్పుత్నిక్‌ లైట్‌ పై మనదేశంలో 3వ దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్‌ లైట్‌ టీకా 79.4 శాతం ప్రభావశీలత ప్రదర్శించినట్లు ఆర్‌డీఐఎఫ్‌ గతంలో ప్రకటించిన విషయం విదితమే.  3వ దశ క్లినికల్‌ పరీక్షల్లో సానుకూల ఫలితాలు లభించిన పక్షంలో స్పుత్నిక్‌ లైట్‌ టీకాను మన దేశంలో విక్రయించడానికి అనుమతి లభించే అవకాశం ఉంటుంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని