కొత్తగా 324 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 324 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 324 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,62,526కు పెరిగింది. మహమ్మారితో ఒకరు కన్నుమూశారు. ఇప్పటి వరకు 3,899 మంది మృతి చెందారు. తాజాగా 280 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులవగా.. మొత్తం 6,53,302 మంది కోలుకున్నారు. ఈ నెల 15న సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 73,323 నమూనాలను పరీక్షించారు. మరో 2,062 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 79 కరోనా కేసులు నమోదు కాగా.. ఖమ్మం జిల్లాలో 24,  కరీంనగర్‌లో 22, నల్గొండలో 19, రంగారెడ్డిలో 18, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 15, పెద్దపల్లి, హనుమకొండలో 12, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 11 చొప్పున పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 10 కంటే తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని