54 శాతం అదనంగావరి సాగు

ప్రధానాంశాలు

54 శాతం అదనంగావరి సాగు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో సాధారణంకన్నా 54 శాతం అదనంగా పెరిగింది. వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులు, రిజర్వాయర్లలో నీరు నిండుగా ఉంది. భూగర్భ జలమట్టాలు పెరిగాయి. దీంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో అన్ని రకాల పంటలు కలిపి 1.25 కోట్ల ఎకరాల్లో సాగయ్యాయి. అందులో పత్తి, వరి మాత్రమే కోటీ 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఆహారధాన్యాలు 124 శాతం, పప్పుధాన్యాలు 96, నూనెగింజలు 66 శాతం విస్తీర్ణంలో సాగుచేశారు. వరి, పత్తి, కంది మినహా మిగిలిన పంటలన్నీ సాధారణంకన్నా తక్కువ విస్తీర్ణంలో వేయడం గమనార్హం. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో సాధారణంకన్నా అధిక వర్షపాతం నమోదైంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని