భవన నిర్మాణానికి నిధులు ఇవ్వండి

ప్రధానాంశాలు

భవన నిర్మాణానికి నిధులు ఇవ్వండి

ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధుల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల కోసం హైదరాబాద్‌లో సంక్షేమ భవన్‌ నిర్మాణానికి స్థలం, నిధులు మంజూరు చేయాలని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, నవీన్‌కుమార్‌, ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు తదితరులు సీఎం కేసీఆర్‌ను కోరారు. గురువారం ప్రగతిభవన్‌లో వారు ముఖ్యమంత్రిని కలిసి ప్రజాప్రతినిధుల తరఫున వినతిపత్రం సమర్పించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని