తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్ధక సేవలు భేష్‌

ప్రధానాంశాలు

తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్ధక సేవలు భేష్‌

కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పశువైద్య సేవలు బాగున్నాయని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంచార పశువైద్య కేంద్రాలకు కేంద్రం వంద శాతం గ్రాంటునిస్తుందని, నిర్వహణలో 60 శాతం ఖర్చులు భరిస్తామని చెప్పారు. గురువారం ఆయన సహాయమంత్రులు సంజీవ్‌కుమార్‌, ఎల్‌.మురుగన్‌లతో కలిసి దక్షిణభారత రాష్ట్రాల పార్లమెంటు సభ్యులతో దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్‌ భారత్‌ యోజన ద్వారా పశుసంవర్ధక శాఖ శీతల గిడ్డంగుల నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందన్నారు. పశువైద్య విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, పాడి సహకార సంఘాలను బలోపేతం చేయడంతో పాటు పాడి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని తెలిపారు. తెరాస రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. వరంగల్‌లో పశుసంవర్ధక కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని