యాదాద్రి భువనగిరి డీపీవో సరెండర్‌

ప్రధానాంశాలు

యాదాద్రి భువనగిరి డీపీవో సరెండర్‌

భువనగిరి, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో)గా పనిచేస్తున్న సాయిబాబాను రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ పమేలా సత్పతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంలో వెనకబడి పోవడం, పనితీరులో మార్పు రానందున ఆ శాఖకు సరెండర్‌ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. చౌటుప్పల్‌ డివిజనల్‌ పంచాయతీ అధికారి(డీఎల్పీవో)గా పనిచేస్తున్న సాధనకు ఇన్‌ఛార్జి డీపీవోగా బాధ్యతలు అప్పగించామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని