పుట్టిన తేదీ నమోదులో దిద్దుబాటు ఎందుకు..?

ప్రధానాంశాలు

పుట్టిన తేదీ నమోదులో దిద్దుబాటు ఎందుకు..?

‘చటాన్‌పల్లి’ మృతుడి రికార్డుపై ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఒకరైన జొల్లు నవీన్‌ వయసు ధ్రువీకరణకు సంబంధించి జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌లో గురువారం విచారణ జరిగింది. నవీన్‌ చదివిన మహబూబ్‌నగర్‌ జిల్లా జక్లేర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల రికార్డుల గురించి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగదీశ్‌ నుంచి స్టేట్‌ కౌన్సిల్‌ వి.సురేందర్‌రావు పలు వివరాలు సేకరించారు. పాఠశాల అడ్మిషన్‌ రిజిస్టర్‌లో దిద్దుబాటు ఎందుకు ఉందని ఆరా తీశారు.  ప్రధానోపాధ్యాయుడు సమాధానమిస్తూ.. ‘గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు విద్యార్థుల వయసు వివరాల నమోదులో తాత్సారం జరుగుతుంది. పలు విడతలుగా అడిగితేనే విద్యార్థుల తల్లిదండ్రులు అందుకు సంబంధించిన పత్రాలు తీసుకొచ్చి అప్పగిస్తుంటారు. అప్పటి వరకు ఇతర వివరాలు నమోదు చేసి.. వయసు రాయాల్సిన స్థలాన్ని ఖాళీగా ఉంచుతారు. ఆ వివరాలు వచ్చాకే తేదీని నమోదు చేస్తారు. నవీన్‌ విషయంలోనూ అలాగే జరిగింది’ అని బదులిచ్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని